ఆమె ఒక హిజ్రా.. అయితే ఆమె ఎంతో అందంగా ఉండడంతో ఆమె అందాన్ని చూసి ఓ యువకుడు ప్రేమలో పడిపోయాడు. ఎలాగైనా తనతో కలిసి జీవితం పంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే తన ప్రేమ విషయం ఆమెకు చెప్పడంతో మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తాను ఒక హిజ్రా అని ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నాననే విషయం తెలియ జేసింది. అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ యువకుడు చెప్పడంతో అతనిలోని నిజాయితీ నచ్చి ఆమె తన ప్రేమకు అంగీకరించింది. అయితే నాలుగు సంవత్సరాలపాటు తనతో సహజీవనం చేసిన ఆ యువకుడు ఆమెను దారుణంగా చంపాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అఫ్జల్‌గఢ్‌కు చెందిన అజీమ్ అనే హిజ్రాతో షాదాబ్ అనే యువకుడు గత నాలుగు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఎంతో హాయిగా సాగిపోయింది. ఇటీవలే వీరిద్దరి మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి.
ఈ క్రమంలో షాదాబ్ శుక్రవారం ఉదయం ఈ విషయం గురించి అజీమ్ తో రూ.15 లక్షలకు సంబంధించిన విషయం గురించి గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి గురైన షాదాబ్ తుపాకీతో అజీమ్ ను కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ సంఘటనను తాను పెంచుకుంటున్న దత్తపుత్రిక చూడటంతో పోలీసులకు ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న షాదాబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…