ప్రస్తుత కాలంలో పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే, పిల్లల నిర్ణయాలకి అనుమతి తెలపకపోతే పిల్లలు మానసికంగా కృంగిపోతూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమ అనుకున్నది సాధించలేక పోయామని ఆత్మహత్యకు పాల్పడుతుండగా మరికొందరు వారు అనుకున్న కార్యానికి అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన
హర్యానా రోహ్‌తక్ ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
హర్యానాలోని రోహ్‌తక్ ప్రాంతానికి చెందిన అభిషేక్ మాలిక్ క్యాబిన్ క్రూ కోర్సు చేశాడు. ఆ కోర్సు చేసే సమయంలో అతనికి ఒక స్నేహితుడు పరిచయం కావడంతో అతనికి లైంగిక మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాలనే ఆశ కలిగింది. ఈ క్రమంలోనే లైంగిక మార్పిడి కోసం అవసరమయ్యే డబ్బులను ఇవ్వవలసిందిగా తన తల్లిదండ్రులను కోరాడు. అయితే అందుకు తన తల్లిదండ్రులు నిరాకరించడంతో వారందరినీ హత్య చేయాలని ప్లాన్ వేశాడు.
ఈ క్రమంలోనే తన తండ్రి స్నేహితుడి దగ్గర లైసెన్స్ లేని తుపాకీ తీసుకుని తన తల్లిదండ్రులని తన సోదరిని కుటుంబం మొత్తాన్ని తుపాకితో కాల్చిచంపాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకొని తను కాల్చిన తుపాకీ కాలువలో పడేసి తన స్నేహితుని కలవడం కోసం ఢిల్లీ బైపాస్ దగ్గర్లో ఉన్న హోటల్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తన మామయ్య ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ డ్రామా ఆడుతూ చివరికి పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…