దారుణం.. లింగమార్పిడి వద్దన్నారని కుటుంబాన్ని హత్య చేసిన యువకుడు..!

September 6, 2021 9:21 PM

ప్రస్తుత కాలంలో పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే, పిల్లల నిర్ణయాలకి అనుమతి తెలపకపోతే పిల్లలు మానసికంగా కృంగిపోతూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమ అనుకున్నది సాధించలేక పోయామని ఆత్మహత్యకు పాల్పడుతుండగా మరికొందరు వారు అనుకున్న కార్యానికి అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన
హర్యానా రోహ్‌తక్‌ ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

దారుణం.. లింగమార్పిడి వద్దన్నారని కుటుంబాన్ని హత్య చేసిన యువకుడు..!

హర్యానాలోని రోహ్‌తక్‌ ప్రాంతానికి చెందిన అభిషేక్ మాలిక్ క్యాబిన్ క్రూ కోర్సు చేశాడు. ఆ కోర్సు చేసే సమయంలో అతనికి ఒక స్నేహితుడు పరిచయం కావడంతో అతనికి లైంగిక మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాలనే ఆశ కలిగింది. ఈ క్రమంలోనే లైంగిక మార్పిడి కోసం అవసరమయ్యే డబ్బులను ఇవ్వవలసిందిగా తన తల్లిదండ్రులను కోరాడు. అయితే అందుకు తన తల్లిదండ్రులు నిరాకరించడంతో వారందరినీ హత్య చేయాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలోనే తన తండ్రి స్నేహితుడి దగ్గర లైసెన్స్ లేని తుపాకీ తీసుకుని తన తల్లిదండ్రులని తన సోదరిని కుటుంబం మొత్తాన్ని తుపాకితో కాల్చిచంపాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకొని తను కాల్చిన తుపాకీ కాలువలో పడేసి తన స్నేహితుని కలవడం కోసం ఢిల్లీ బైపాస్ దగ్గర్లో ఉన్న హోటల్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తన మామయ్య ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ డ్రామా ఆడుతూ చివరికి పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now