ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత కొందరికి తన తల్లి భారంగా మారుతుంది. ఇలా ఓ కొడుకు జులాయిగా తిరుగుతూ తన తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కారణం చేత ఆమె మెడకు కరెంటు వైరును బిగించి చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ పరిగి మండలం కుదావంద్ పూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్థానికంగా ఉన్న భీమమ్మ, ఆమె కొడుకు బలవంత్ లు తమకున్న కొంత పొలంతో జీవనం సాగించేవారు. అయితే భీమమ్మ కొడుకు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తన తల్లి పెన్షన్, రైతుబంధు డబ్బులను లాక్కొని మద్యం సేవిస్తూ జులాయి తిరుగుళ్ళు తిరిగే వాడు. తన కొడుకు ఈ విధంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి.
ఒకరోజు తనకు డబ్బులు కావాలని తన తల్లిని ఎంతో ఒత్తిడికి గురి చేసిన బలవంత్ తన తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది. తన తల్లి లేకపోతే ఆమె పేరుపై ఉన్న పొలం తన సొంత అవుతుంది, దానికి వచ్చే డబ్బులు కూడా తనకే దక్కుతాయని భావించి తన తల్లి మెడకు కరెంటు వైర్ బిగించి చంపాడు. ఇలా దారుణానికి పాల్పడి ఏమీ ఎరగనట్టు ఉండడంతో ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు. బలవంత్‌ను అరెస్టు చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…