మన పూర్వీకుల కాలం నుంచి భర్త చనిపోయిన తర్వాత భార్యను వితంతువుగా చేసే ఆచారం వస్తోంది. ఈ సమయంలోనే సుమంగళిగా ఉన్న స్త్రీకి నుదుటిన బొట్టు, పసుపు, కుంకుమ మెడలో మాంగళ్యం, కాలి మెట్టెలను, పువ్వులను దూరం చేస్తారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఈ వస్తువులను భార్య అలంకరించుకోకూడదని చెబుతారు. అయితే నిజంగానే భర్త చనిపోయిన తర్వాత మహిళ నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదా ? శాస్త్రం ఏం చెబుతుంది ? అనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం.. భర్త చనిపోయిన తర్వాత మహిళ నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదన్న నియమం ఎక్కడా లేదు. భర్త చనిపోయిన తర్వాత మహిళ నిరభ్యంతరంగా నుదుటిపై బొట్టు పెట్టుకోవచ్చు. అయితే ఒక స్త్రీ పెళ్లికాకముందు నుంచి.. అంటే.. జన్మించినప్పటి నుంచి నుదుటిపై బొట్టు పెట్టుకొని ఉంటుంది. కానీ భర్త మరణించిన తర్వాత ఆ బొట్టుని తొలగించాలని ఏ శాస్త్రంలోనూ లేదు. అయితే పెళ్లయిన మహిళకు నుదుటిపై కాకుండా మాంగళ్య ధారణ జరిగిన తర్వాత పాపిడిపై బొట్టు వస్తుంది. కనుక వితంతువు అయ్యాక పాపిడిపై బొట్టును ధరించరాదు. కానీ నుదుటిపై బొట్టును ధరించవచ్చు.
వివాహం తర్వాత ఒక స్త్రీకి పాపిడిలో సింధూరం పెట్టుకునే అర్హత వస్తుంది కనుక.. భర్త చనిపోయిన తర్వాత అతని ద్వారా వచ్చిన పాపిడి బొట్టును తొలగించాలి కానీ నుదుటిపై ఉన్న బొట్టును తొలగించాలని, నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదని.. మనకు ఏ శాస్త్రం చెప్పడంలేదు. ఒక స్త్రీ జీవితంలోకి భర్త వచ్చిన తర్వాత తన జీవితంలోకి వచ్చే మాంగళ్యం, మెట్టెలను, పాపిడి బొట్టును తొలగించాలి తప్ప.. నుదుటిపై బొట్టును నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు.. అని పండితులు తెలియజేస్తున్నారు. నుదుటిపై ఉండే బొట్టు స్థానం సాక్షాత్తూ అమ్మవారి స్థానం. అక్కడ బొట్టును పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నుదుటిపై ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాల్సిందే. దీనికి ఎలాంటి షరతులు, నిబంధనలు లేవు. కనుక ఎవరైనా సరే నుదుటిపై బొట్టును పెట్టుకోవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…