సాధారణంగా ప్రతి నెలలో బ్యాంకులకు కొన్ని రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అయితే అక్టోబర్ నెలలో పండుగల సీజన్ కనుక ఈసారి సహజంగానే సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 21 రోజులు సెలవులు ఉండనున్నాయి. మరి ఏయే తేదీల్లో సెలవులు ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
అక్టోబర్ 1వ తేదీన బ్యాంకులకు ఆర్థిక సంవత్సరం సగం పూర్తవుతుంది. ఈ సెలవు గాంగ్‌టక్‌లో ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి. అక్టోబర్ 3 ఆదివారం. అక్టోబర్ 6న మహాలయ అమావాస్య. ఈ రోజు అగర్తల, బెంగళూరు, కోల్‌కతాలలో సెలవులు ఉంటాయి. అక్టోబర్ 7న ఇంఫాల్‌లో మీరా కావోరెన్ హౌబా సెలవు. అక్టోబర్ 9న రెండో శనివారం. 10వ తేదీన ఆదివారం.
అక్టోబర్ 12న దుర్గాపూజ, 13న మహా అష్టమి, 14న దసరా, అక్టోబర్ 15వ తేదీన దుర్గా పూజ, 16న గాంగ్‌టక్‌లో దుర్గా పూజ, అక్టోబర్ 17న ఆదివారం. 18వ తేదీన గువాహతిలో కతి బిహు సెలవు. 19న ఈద్-ఇ-మిలాద్, 20వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి. 22వ తేదీన జమ్మూ, శ్రీనగర్‌లలో ఈద్-మిలాద్. 23న నాలుగో శనివారం. 24 ఆదివారం. అక్టోబర్ 26వ తేదీన జమ్మూ, శ్రీనగర్‌లలో సెలవు. 31వ తేదీ ఆదివారం.
ఈ విధంగా అక్టోబర్ లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. కనుక సెలవులకు అనుగుణంగా లావాదేవీలను ప్లాన్ చేసుకుంటే ఆటంకం కలగకుండా చూసుకోవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…