దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న పేగును కడతేర్చిన కసాయి తల్లి..

September 17, 2021 6:35 PM

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు అధికమవుతుండడం వల్ల కన్నపేగుపై కూడా మమకారం లేకుండాపోతోంది. ఈ క్రమంలోని కామంతో కళ్లు మూసుకుపోయిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పేగు తెంచుకుని పుట్టిన పిల్లల పట్ల ఏమాత్రం దయ, జాలి లేకుండా పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వం, దుర్గ అనే దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్‌ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి గోపాలకృష్ణన్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే దుర్గ గోపాలకృష్ణన్ తో ఎంతో చనువుగా ఉండి అతనితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది.

కాగా ఒకరోజు  దుర్గ తన ప్రియుడు గోపాలకృష్ణన్ తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె కొడుకు సూర్య వారిద్దరినీ చూశాడు. ఈ క్రమంలోనే ఆ విషయాన్ని తన కొడుకు ఎక్కడ బయటపెడతాడోనన్న ఉద్దేశంతో కన్న తల్లి తన ప్రియుడితో చేతులు కలిపి పథకం ప్రకారం తన కొడుకును అతి దారుణంగా చంపించింది. ఆమె ప్రియుడు, మరొక వ్యక్తి కలసి సూర్యని తీసుకెళ్లి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now