మద్యం మత్తులో కన్న కూతురిపై.. దారుణానికి పాల్పడిన తండ్రి..

September 22, 2021 12:47 PM

సాధారణంగా కన్న కూతురికి తన తండ్రి ఆసరా ఎంతో ఉంటుంది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తండ్రి తన బిడ్డకు ఏం కష్టం రాకుండా చూసుకుంటాడు. అయితే మెదక్ జిల్లాలో ఓ కన్నబిడ్డకు తండ్రి నుంచి ఒక అమానుష ఘటన ఎదురయింది. అభం శుభం తెలియని చిన్నారి పట్ల ఆ రాక్షస తండ్రి ప్రవర్తించిన తీరు అందరిని కలచి వేస్తోంది. ఫుల్లుగా మద్యం తాగిన మత్తులో తన కూతురి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఓ తండ్రి చంటి బిడ్డను గొడ్డును బాదినట్టు బాదిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

మద్యం మత్తులో కన్న కూతురిపై.. అలాంటి దారుణానికి పాల్పడిన తండ్రి..

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తికి వివాహం జరిగి నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. అయితే తన భార్య మరణించడంతో నాగరాజు రెండవ వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన నాగరాజు సోమవారం ఫుల్ గా తాగి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో పినతల్లి తన కూతురికి అన్నం తినిపిస్తూ ఉంది.

చిన్నారి అన్నం తిననని మారాం చేయడంతో నాగరాజు మద్యం మత్తులో ఉండి ఎంతో ఆగ్రహానికి గురయ్యాడు. తన కూతురు అన్నం తిననని మారాం చేయడంతో ఏకంగా ఒక తాడు తీసుకొని చిన్న పిల్ల అని కూడా చూడకుండా తనపట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించాడు. అలాగే తనని చేత్తో గాల్లోకి లేపి ఒక్కసారిగా కిందకేసి కొట్టాడు. తన భర్త కూతురి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ పినతల్లి అక్కడే కూర్చొని ఈ ఘటన చూస్తూ ఉండటం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now