విషం పెట్టి బిడ్డను చంపిన కసాయి తల్లి.. ఏం జరిగిందంటే!

August 10, 2021 7:24 PM

ఈ ప్రపంచంలో అమ్మతనం  కన్నా గొప్పది ఏది ఉండదు అంటారు. తనపేగు తెంచుకుని పుట్టిన బిడ్డపట్ల ఆ తల్లి చూపే ప్రేమ అనురాగాలు అమితమైనవి.తన బిడ్డ కడుపు నింపడం కోసం ఆతల్లి పస్తులుండిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అయితే పేగు తెంపుకొని పుట్టిన బిడ్డపట్ల కసాయిగా ప్రవర్తించే తల్లులు కూడా ఉంటారని పంజాబ్ లో జరిగిన ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. భర్త పై ఉన్న కోపంతో బిడ్డకు విషమిచ్చి చంపిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కపుర్తాలా పరిధిలోని హశువల్ గ్రామానికి చెందిన హర్జీత్ సింగ్, సారాబ్జిత్ కౌర్‌‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. వీరిలో పెద్దబ్బాయి పేరు అవిజోత్ సింగ్. ఎంతో హాయిగా సాగిపోతున్న ఈ సంసారంలో పలు గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోని ఈ దంపతులు కొత్తగా నిర్మించిన ఇంటి విషయంలో వీరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ తరచూ గొడవ పడేవారు.

ఈ గొడవల కారణంగా మానసికంగా కృంగిపోయిన సారాబ్జిత్ తన భర్త పై కోపంతో తను ఇంట్లో లేని సమయం చూసి. తన పెద్ద కొడుకు అవిజోత్ కి అన్నంలో విషం కలిపి బలవంతంగా తనకు తినిపించింది. అయితే విషం కలిపిన అన్నం తినటం వల్ల అపస్మారక స్థితిలో ఉన్న తనకొడుకుని చూసి ఏం జరిగిందోనని హర్జీత్ సింగ్ గ్రామ సర్పంచి వద్దకు పరుగులు పెట్టి తన కారులో తన కొడుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.అసలు బాలుడు ఏ విధంగా మృతిచెందాడని ఆరా తీయగా స్వయంగా తన తల్లి కొడుకు విషం కలిపిన అన్నం తినిపించిందని తెలియడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment