విషాదం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు..

September 19, 2021 7:21 PM

సాధారణంగా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకొని ఎంతో సుఖంగా, సంతోషంగా జీవితంలో ముందుకు సాగి పోతూ ఉంటారు. అయితే కొందరి జీవితాలలో మాత్రం ఎన్నో సమస్యలు, కష్టాలు వస్తుంటాయి. ఆదిలాబాద్ కి చెందిన రాహుల్ గౌడ్, మౌనిక అనే యువతీయువకులు ప్రేమించుకుని గత రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

విషాదం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు..

కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మౌనిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త రాహుల్ గౌడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు రాహుల్ గౌడ్ ను స్టేషన్ కి పిలిపించి అతని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన రాహుల్ గౌడ్ ఎంతో మనస్థాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన రాహుల్ గౌడ్ శనివారం ఉదయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన వన్ టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాహుల్ ను తన వాహనంలో తీసుకుని చికిత్స నిమిత్తం రిమ్స్ కి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందడంతో అతని బంధువుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now