తనను ప్రేమించాలని పదో తరగతి బాలికపై ఒత్తిడి.. వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య..

September 12, 2021 11:36 PM

ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువకుడు తనను ప్రేమించాలంటూ సదరు బాలికపై అధిక ఒత్తిడి తీసుకురావడంతో అతని వేధింపులు భరించలేని బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

తనను ప్రేమించాలని పదో తరగతి బాలికపై ఒత్తిడి.. వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య..

ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన పదో తరగతి బాలికపై సాయి అనే యువకుడు నిత్యం తనను ప్రేమించాలంటూ మానసిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీ ఆమెపై అధికంగా ఒత్తిడి చేయడంతో ఎంతో మానసిక వేదన అనుభవించిన విద్యార్థిని తట్టుకోలేక తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఈ విధంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ యువతి శుక్రవారం సాయంత్రం మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాలికపై వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య తెలుసుకుందని తెలుసుకున్న పోలీసులు నిందితుడు సాయిని  అదుపులోకి తీసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now