అత్యాచార అవమానం తట్టుకోలేక తనువు చాలించిన బాలిక

September 13, 2021 11:10 AM

అమ్మాయిల  రక్షణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ మహిళలపై, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ విధమైన వార్తలను చదువుతూనే ఉన్నాం. అత్యాచారాలకు కొందరు బలవుతుండగా.. మరికొందరు ఆ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

అత్యాచార అవమానం తట్టుకోలేక తనువు చాలించిన బాలిక

మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఓ వ్యక్తి తమ సమీప బంధువు ఇంటికి తరచూ వెళ్తూ ఆ కుటుంబంలో ఉన్న 17 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సదరు బాలిక బయటకు చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ కావడంతో అసలు విషయం ఇంటా బయట తెలిసింది. దీంతొ ఎంతో అవమానంగా భావించింది.

ఈ క్రమంలో అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు యువతిపై అత్యాచారం చేసిన యువకుడిని అరెస్టు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now