దారుణం.. ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి రూ.40వేలు పోగొట్టుకున్న బాలుడు.. త‌ల్లి తిట్టే స‌రికి ఆత్మ‌హ‌త్య..

July 31, 2021 3:34 PM

ఆన్‌లైన్ గేమ్స్ అనేవి పెద్ద‌లే కాదు పిల్ల‌ల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. వాటి బారిన ప‌డి ఇప్ప‌టికే ఎంతో మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ బాలుడు ఓ ఆన్‌లైన్ గేమ్ బారిన ప‌డి డ‌బ్బులు పోగొట్టుకున్నాడు. ఆ విష‌యం తెలిసిన త‌ల్లి తిట్టే స‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

boy lost rs 40000 in online game and done suicide

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఛ‌త‌ర్‌పూర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల కృష్ణ అనే బాలుడు స్థానికంగా ఉన్న నీవ్ అకాడ‌మీలో 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అత‌ను ఫ్రీ ఫైర్ అనే స్మార్ట్ ఫోన్ గేమ్‌కు బానిస అయ్యాడు. ఈ క్ర‌మంలోనే త‌న త‌ల్లి అకౌంట్ నుంచి రూ.40వేల‌ను ఖ‌ర్చు చేసి ఆన్‌లైన్ లో ఆ గేమ్‌లో పోటీ ప‌డ్డాడు. కానీ అత‌ను గేమ్ లో ఓడిపోవ‌డంతో ఆ రూ.40వేలు పోయాయి.

అయితే విష‌యం తెలుసుకున్న కృష్ణ త‌ల్లి అత‌న్ని తిట్టింది. దీంతో అత‌ను ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌ను ఓ సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు.

సారీ.. అమ్మా.. మీకు అమ‌ర్యాద క‌లిగించాను. గేమ్ లో రూ.40వేలు పోయాయి. సారీ.. ఏడ‌వ‌కు.. అని ఓ నోట్ రాశాడు. ఈ క్ర‌మంలో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా కృష్ణ త‌ల్లి స్థానికంగా ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ఆరోగ్య సిబ్బందిగా ప‌నిచేస్తుండ‌గా.. తండ్రి ఓ పాథాల‌జీ ల్యాబ్‌లో ప‌నిచేస్తున్నాడు. ఆ విధంగా అత‌ను ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై డ‌బ్బులు పోగొట్టుకుని ఆ మాన‌సిక వేద‌న‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌ల్లిదండ్రుల‌కు గ‌ర్భ‌శోకం మిగిల్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now