మృత్యువు మనకు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మనకు చావు దగ్గర పడింది అంటే చీమ కుట్టిన చనిపోతారనేది వాస్తవం. అంత వరకు ఎంతో సంతోషంగా గడిపిన ఆ కుర్రాడిని చావు పలకరించడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పరప్పన అగ్రహార ప్రాంతానికి చెందిన దినేష్ అనే యువకుడు పుట్టినరోజు వేడుకలకు బెలూన్లు సప్లయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాను నివసిస్తున్న ప్రాంతంలో దినేష్ కు ఓ ఆర్డర్ వచ్చింది. బర్త్ డే పార్టీకి 200 బెలూన్లు ఆర్డర్ రావడంతో 100 బెలూన్లను పంపిన దినేష్.. మరో వంద బెలూన్లతో బర్తడే జరిగే ఇంటిని డెకరేషన్ చేయాలని భావించాడు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి తనను నమ్ముకున్న పని తన ప్రాణాలు తీస్తుందని కలలో కూడా ఊహించలేదు.
ఈ క్రమంలోనే దినేష్, అతని అసిస్టెంట్ మహదేష్ బర్త్ డే పార్టీ జరిగే అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉండి బెలూన్లలో గాలి నింపుతున్నారు. అప్పటికి కొన్ని బెలూన్లను నింపి డెకరేషన్ చేశారు. ఈ క్రమంలోనే మహా దేశ్ నీళ్ళు తాగడానికి అపార్ట్మెంట్ లోపలికి వచ్చాడు.అక్కడ నీళ్లు తాగి తన స్నేహితుడు దినేష్ కు నీళ్లు తీసుకుపోయేలోగా సిలిండర్ పేలి దినేష్ మృతిచెందడంతో మహాదేవ్ కన్నీరుమున్నీరయ్యారు. దినేష్ ఎల్లప్పుడు కృత్రిమ రసాయనాలతో ఆ సిలిండర్ నింపే వాడు.అయితే ఈ విధంగా సిలిండర్ పేలడంతో దినేష్ అక్కడికక్కడే మృతి చెందడంతో , అప్పటివరకు పుట్టినరోజు వేడుకలతో ఎంతో సంతోషంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…