దొంగ తెలివితేటలు మామూలుగా లేవు.. ఏకంగా ఏటీఎం మిషన్ లోకి దిగి దొంగతనం.. చివరికి అలా దొరికిపోయాడు!

August 8, 2021 9:45 PM

సాధారణంగా ఎంతోమంది ఎన్నో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైనా దొంగతనానికి పాల్పడినప్పుడు ఎవరూ కంటపడకుండా దొంగలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే చాలామంది డబ్బులు దొంగతనం చేయడం కోసం ఏటీఎంలను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరు లేని సమయంలో ఏటీఎం మిషన్లు పగలగొట్టి దొంగతనాలు చేయడం, లేదా కొన్ని దొంగ బుద్ధులను చూపిస్తూ అందులో ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా తమిళనాడులో ఓ దొంగ మాత్రం తన అద్భుతమైన తెలివితేటలను చూపించి అడ్డంగా దొరికిపోయాడు.

తమిళనాడులోని నామక్కల్ జిల్లా అవన్యాపురంలో ఓ వ్యక్తి ఒక ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేయాలని భావించాడు.ఈ క్రమంలోనే ఎటిఎం ముందు బాగానే పగలగొట్టిన ఆ దొంగ ఏకంగా మిషన్ లోపలికి దిగి డబ్బులను దొంగలించాలని చూశాడు. ఈ క్రమంలోనే ఏటీఎం లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి బయటకు రాలేక గిలగిల కొట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్ నుంచి బయటకు రాలేక కష్టపడుతున్న ఆ దొంగను చూసి స్థానికులు గూమిగుడారు. ఈ క్రమంలోనే ఇదే విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ దొంగను అరెస్ట్ చేసి తనదైన స్టైల్ లో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ దొంగకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now