సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణమే. అయితే ఈ మనస్పర్ధలు కారణంగా మాట మాట పెరిగి వారి మధ్య గొడవ తారస్థాయికి చేరుకొని క్షణికావేశంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఓ భర్త తన భార్య చికెన్ ఫ్రై సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడి ఆవేశంలో తన భార్యను చంపాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త పాషా, షిరిన్ భాను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పాషా బెడ్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక రోజు షిరిన్ చెల్లెలు తన ఇంటికి రావడంతో పాషా వెళ్లి చికెన్ తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య చికెన్ ఫ్రై చేసింది. అయితే చికెన్ సరిగ్గా చేయలేదని షిరిన్ భానుపై పాషా కోప్పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.
అయితే తన ఇంట్లో తన మరదలు ఉండటం చేత ఆ గొడవ అక్కడితో ఆగిపోయినప్పటికే తన మరదలు వెళ్లగానే తిరిగి ఒక రోజు ఇదే గొడవ వారి మధ్య చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పాషా తన భార్యపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తన భార్య తలపై బాదడంతో షిరిన్ భాను అధిక రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయిన తన భార్య మృతదేహాన్ని తీసుకుని చిక్కబనవర లేక్‌లో పడేశాడు. తన భార్య మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడం వల్ల పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయట పెట్టాడు. ఈ క్రమంలోనే పోలీసులు చిక్కబనవర లేక్‌లో షిరిన్ భాను మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…