దారుణం.. 300 కుక్క‌ల‌ను చంపేశారు.. ఇంత పాశ‌విక‌మా..?

August 1, 2021 6:27 PM

సాధార‌ణంగా వీధుల్లో తిరిగే కుక్క‌ల‌ను ప‌ట్టుకునే మున్సిప‌ల్ సిబ్బంది సంర‌క్ష‌ణ కేంద్రాల్లో విడిచి పెడ‌తారు. లేదా కెన్న‌ల్స్‌లో పెట్టి ద‌త్తత తీసుకునే వారికి అంద‌జేస్తారు. అయితే ఆ అధికారులు మాత్రం దారుణ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా 300 కుక్క‌ల‌ను చంపేశారు. వివ‌రాల్లోకి వెళితే..

300 street dogs killed by panchayath officials

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప‌శ్చిమ గోదావరి జిల్లాలోని లింగ‌పాలెం పంచాయ‌తీకి చెందిన అధికారులు 300 కుక్క‌ల‌కు విషం పెట్టి చంపారు. విష‌పు ఇంజెక్ష‌న్ల‌ను ఇచ్చి వాటిని బ‌లి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో వాటిని క‌నీసం పూడ్చ‌కుండా గొయ్యిలో ప‌డేశారు. అయితే వాటిని అలా చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌ద‌రు అధికారులపై ఆగ్ర‌హిస్తున్నారు.

మూగ‌జీవాల ప‌ట్ల అంత‌లా పాశ‌వికత‌ను ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. కుక్క‌ల‌ను పొట్ట‌న పెట్టుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ విష‌యంపై స్పందించిన అధికారులు మాత్రం.. కుక్క‌లు దాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని, అందుక‌నే చంపేశామ‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విష‌యం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now