తన కూతురు పెద్ద చదువులు చదివి మంచి డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేయాలని ఆ తల్లి ఎన్నో కలలు కనింది. ఈ క్రమంలోనే నిత్యం తన కూతురు చదువులో తన వెంటే ఉంటూ ఎంతో ప్రోత్సహించేది.
ఈ క్రమంలోనే పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని వైద్య ప్రవేశ పరీక్ష కోసం ఇప్పటి నుంచే అందుకు సిద్ధం కమ్మని తరుచూ తనకు గుర్తు చేసేది. ఈ క్రమంలోనే నిత్యం తనని చదువుకోవాలనే పదేపదే చెప్పడంతో కూతురు మాత్రం తన తల్లి చెప్పే మాటలను పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా తిరిగేది.
ఈ క్రమంలోనే తల్లి చదువుకోమని వాదించింనప్పుడు దీంతో విసుగు చెందిన కూతురు ఏకంగా కరాటే బెల్ట్ తీసుకొని తన తల్లి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నేవీ ముంబైలోని ఎయిరోలీ ప్రాంతానికి చెందిన బాలిక తన తల్లి తరచూ చదువుకోమని చెప్పడంతో విసుగుచెంది ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సదరు బాలిక తన మామయ్యకి ఫోన్ చేసి అమ్మ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.
ఎంతసేపటికి బయటకు రాలేదంటూ ఫోన్ చేయడంతో తన మామయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించి శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ చూసి పోలీసులు ఖంగుతిన్నారు. ఆమెది ఆత్మహత్య కాదని హత్యని తెలియడంతో సదరు బాలికను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపెట్టింది.
ఇంత చిన్న వయసులోనే తల్లిని చంపి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ బాలిక ఆడిన నాటకం గురించి తెలిసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.కన్నతల్లి అనే ప్రేమ కూడా లేకుండా ఆమె పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించిన బాలికను అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…