ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పెట్టుబడి స్కీమ్‌లలో పోస్టాఫీస్ స్కీమ్‌లు అత్యంత సురక్షితమైనవని చెప్పవచ్చు. వాటిలో డబ్బును పెట్టుబడి పెడితే చక్కని ఆదాయం కూడా పొందవచ్చు. ఈ క్రమంలోనే 5 ఏళ్ల మెచూరిటీతో అందుబాటులో ఉన్న పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్‌లో నెల నెలా కొంత మొత్తంలో సొమ్మును జమ చేస్తే మెచూరిటీ తీరాక పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీతో సహా పొందవచ్చు. దీన్నే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అని వ్యవహరిస్తున్నారు. ఇందులో పెట్టే డబ్బులకు 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీని మూడు మాసాలకు ఒకసారి లెక్కిస్తారు. కనీసం రూ.100 పొదుపుతో ఈ స్కీమ్‌ను ప్రారంభించవచ్చు.
ఈ స్కీమ్‌లో భాగంగా సింగిల్ లేదా జాయింట్ లేదా ముగ్గురు కలిసి ఒకే అకౌంట్‌ను తెరవవచ్చు. 10 ఏళ్లు పైబడిన వారు కూడా అకౌంట్ తెరవచ్చు. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి.
ఈ స్కీమ్‌లో నెలకు కనీసం రూ.100 పొదుపు చేయవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో పొదుపు చేస్తే అధిక లాభాలు వస్తాయి.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు రూ.10వేలు పెట్టుబడి పెడితే ఏడాదికి 5.8 శాతం వడ్డీ చొప్పున 5 ఏళ్ల మెచూరిటీ గడువు ముగిసే సరికి ఆ మొత్తం రూ.6,96,967 అవుతుంది. 5 ఏళ్లలో డిపాజిట్ సొమ్ము రూ.6 లక్షలు అవుతుంది. వడ్డీ రూ.99,967 చెల్లిస్తారు. ఈ క్రమంలో దాదాపుగా రూ.7 లక్షల ఆదాయం పొందవచ్చు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…