బాహుబలి మొద‌టి మూవీలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేట‌ప్పుడు కింద ఉంచిన ఈ పొడి గురించి తెలుసా ?

September 5, 2021 8:42 PM

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కించిన బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక భాష‌ల‌కు చెందిన సినీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. తెలుగు సినిమా కాదు.. భార‌తీయ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టిన మూవీగా బాహుబ‌లి రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో న‌టులు ప్ర‌భాస్‌, రాణాలు నేష‌న‌ల్ స్టార్స్ అయ్యారు.

బాహుబలి మొద‌టి మూవీలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేట‌ప్పుడు కింద ఉంచిన ఈ పొడి గురించి తెలుసా ?

అయితే ఏ మూవీలో అయినా స‌రే చిన్న చిన్న అంశాలు చాలా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంటాయి. ద‌ర్శ‌కులు చిన్న విష‌యాల్లోనూ అత్యంత జాగ్ర‌త్త వ‌హించి సీన్ల‌ను చిత్రీక‌రిస్తారు. అందుకు గాను వారు అనేక రీసెర్చిలు కూడా చేస్తారు.

బాహుబ‌లి మొద‌టి పార్ట్‌లో రానా (భ‌ల్లాల దేవ‌)కు చెందిన భారీ బంగారు విగ్ర‌హాన్ని పెద్ద ఎత్తున సైనికులు, ప్ర‌జ‌లు క‌లిసి ప్ర‌తిష్టిస్తారు గుర్తుంది క‌దా. ఆ స‌మయంలో విగ్ర‌హం కింద ఎరుపు రంగు పొడి ఒక‌టి ఉంటుంది. సీన్ లో చూస్తే తెలుస్తుంది. అయితే ఆ ఎరుపు రంగు పొడిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ?

చాలా మంది విజువ‌ల్ ఎఫెక్ట్ కోసం అలా పొడిని పెట్టుంటారు.. అని అనుకుంటారు. కానీ ఆ పొడిని అక్క‌డ ఉంచడం వెనుక ఉన్న కార‌ణం అది కాదు. మ‌రేమిటంటే..

https://youtu.be/-7pls7faVes

ఒక భారీ విగ్ర‌హాన్ని ఒక చోట ప్ర‌తిష్టించిన‌ప్పుడు దాన్ని ఉంచే చోట స‌హ‌జంగానే ఒకేసారి విగ్ర‌హాన్ని ఆ చోట ఎత్తేసిన‌ట్లు పెట్టాల్సి వ‌స్తుంది. దీంతో షాక్ లాంటిది వ‌స్తుంది. చుట్టూ ఉన్న ప్ర‌దేశాలు ప్ర‌కంపించిన‌ట్లు అవుతాయి. అయితే ఆ షాక్ లాంటి ప్ర‌కంప‌న‌లు రాకుండా వాటిని శోషించుకునేందుకు ఆ ఎరుపు రంగు పొడిని ఏర్పాటు చేశారు. ఇదీ ఆ పొడిని ఏర్పాటు చేయ‌డం వెనుక ఉన్న అస‌లు కారణం. ద‌ర్శ‌కులు ఇలాంటి చిన్న చిన్న విష‌య‌ల‌ను కూడా చాలా సీరియ‌స్‌గా అమ‌లు చేస్తుంటారు. క‌నుక‌నే అలాంటి వారు తీసే చిత్రాలు భారీగా విజ‌య‌వంతం అవుతుంటాయి. బాహుబ‌లి మూవీల విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. అందుక‌నే ఆ సినిమాలు ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌యం సాధించాయి.

ఇక ఆ పొడిని ఏర్పాటు చేయకుండా ఉంటే షాక్ లాంటి ప్ర‌కంప‌న‌లు రావ‌డంతోపాటు విగ్ర‌హం కూడా దెబ్బ తింటుంది. ఈ రెండు కార‌ణాల వ‌ల్లే ఆ పొడిని ఏర్పాటు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment