మరోసారి అలాంటి పాత్రలో సందడి చేయనున్న.. నటి విద్యాబాలన్!

May 16, 2021 10:22 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటన అందచందాలతో ఎంతోమందిని ఆకట్టుకున్న విద్యాబాలన్ ఎక్కువగా సహజంగా ఉండే పాత్రలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే విద్యాబాలన్‌తో ‘తుమ్హారీ సులు’ చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్న సంస్థ ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మరోసారి కలసి పని చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలైన తనూజ్‌, అతుల్‌లు విద్యాబాలన్ కి స్క్రిప్ట్ వినిపించగా అందులో ఆమె పాత్ర ఎంతో సహజత్వంగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి ఆమె మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.ఎలిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించే ఈ సినిమాలో విద్యాబాలన్ పాత్ర ఎంతో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నిర్మాణ సంస్థతో కలిసి విద్యాబాలన్ మరోసారి పని చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో, ముంబైలోని పలు ప్రాంతాలలో మొత్తం 45 రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాల గురించి చిత్ర బృందం త్వరలోనే తెలియజేయనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment