ఎన్టీఆర్ చేష్టల పై కామెంట్ చేసిన వర్మ.. వీడియో వైరల్!

April 9, 2021 7:46 PM

తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.తాను తీసిన సినిమాలు మాత్రమే కాకుండా తను చేసే ట్వీట్లు కూడా ఎంతో వివాదాన్ని రేకెత్తిస్తాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఎన్టీఆర్, అఖిల్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అఖిల్ తొడ పై చేయి వేసి గిల్లగా అఖిల్ ఎన్టీఆర్ చేయిని తోసేసారు. అంతటితో ఆగకుండా తారక్ మరోసారి అఖిల్ తొడ పై చేయి వేయగా అఖిల్ సిగ్గుపడుతూ కనిపించాడు. ఈ వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేస్తూ “ఇక హీరోయిన్ల భవిష్యత్తు చాలా బాధాకరం” అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

రామ్ గోపాల్ వర్మ ఇదివరకే ఎంతో మంది హీరోల విషయంలో ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేసే వారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” సినిమాలో చేయగా అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాలో అఖిల్ నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now