మాస్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ధమాకా ప్లాన్ చేసిన హీరో..!

August 31, 2021 5:52 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆ తరువాత “రెడ్” అనే మరో మాస్ యాక్షన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించిన రామ్ కి ఆ మూవీ అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది.

మాస్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ధమాకా ప్లాన్ చేసిన హీరో..!

రెడ్ చిత్రం తర్వాత రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. “RAPO19″అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. మొట్టమొదటిసారిగా తమిళంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

మాస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణతో “అఖండ” సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక మాస్ యాక్షన్ కథను దర్శకుడు బోయపాటి రామ్ కి వినిపించడంతో అందుకు రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి పూర్తి స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన తెలియజేసే వరకు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now