జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే అంటూ ప్రేమ వ్యవహారం బయటపెట్టిన శ్రీముఖి

July 7, 2021 3:08 PM

బుల్లితెరపై పటాస్ కార్యక్రమం ద్వారా రాములమ్మగా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత ఎన్నో బుల్లితెర కార్యక్రమాలపై సందడి చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ యాంకర్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు. అయితే బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి బుల్లితెరకు దూరం అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు కూడా లేకపోవడంతో బుల్లి తెరకు దూరమైన ఈమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఏ మాత్రం తన క్రేజ్ తగ్గించుకోవడం లేదు.

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.అదేవిధంగా అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతున్న ఈమె వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా అభిమానులతో ముచ్చట్లు పెట్టిన శ్రీముఖి నెటిజన్ల నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

https://www.instagram.com/reel/CQ0akwFJPzc/?utm_source=ig_web_copy_link

ఈ సందర్భంగా శ్రీముఖి ఉద్దేశించి జీవితంలో మీరు చేసిన పెద్ద తప్పు ఏంటి? అని ప్రశ్నించగా అందుకు శ్రీముఖి సమాధానం చెబుతూ… జనాలను తొందరగా నమ్మడం, ప్రేమించడం నేను చేసిన తప్పు అంటూ సమాధానం తెలిపారు. అదేవిధంగా మరొక నెటిజన్ మీ జీవితంలో ప్రేమ కథలు ఉన్నాయా అంటూ ప్రశ్నించగా… అందుకు శ్రీముఖి అద్భుతమైన ప్రేమకథలు ఉన్నాయంటూ సమాధానం తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now