తగ్గేదే లే.. అంటూ అతనితో స్టేజ్ పై రచ్చ చేసిన శ్రీముఖి..!

August 6, 2021 1:24 PM

బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ కార్యక్రమం ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత పాపులారిటీని దక్కించుకుంది.

తాజాగా శ్రీముఖి స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి యాంకర్ గా వర్షిణి వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కామెడీ స్టార్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా స్టేజిపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఎంతో రచ్చ చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా పలువురు కమెడియన్స్ వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న టువంటి శేఖర్ మాస్టర్ స్టేజీపై చిందులు వేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి గోరేటి వెంకన్న వచ్చారు. ఈయన “మల్లేశం” సినిమాలో పాడిన ఓహో జాంబియా అనే పాట ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ పాటకు పలువురు స్టేజ్ పై చిందులు వేయగా శ్రీముఖి కూడా స్టేజ్ పై సందడి చేస్తూ.. మన వెంకన్న ఉండేవరకు ఈ స్టేజ్ మీద మనం ఎవరు తగ్గేదే లే… అంటూ ఎంతో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now