తెలుగు సినిమా హీరోలలో స్టార్ గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22 పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అభిమానులు, సినిమా సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ తమ్ముడిగా, జనసేన అధినేతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.. చిరంజీవి నాకే కాదు ఎందరికో మార్గదర్శి.. ఎందరికో స్ఫూర్తి ప్రదాత.. ఎందరికో ఆదర్శ ప్రాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పలేనన్ని మాటలు వస్తాయి. నేను ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం అయితే ఆయనలో ఉన్న సుగుణాలు చూస్తూ పెరగడం మరొక అదృష్టమని.. మెగాస్టార్ చిరంజీవి గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అన్నయ్యను ఆరాధించే లక్షలాది మంది అభిమానులలో తాను తొలి అభిమానినని, సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాలలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అన్నయ్య తత్వమని అందుకే ప్రతి ఒక్కరూ తనని సొంత మనిషిగా భావిస్తాంటూ తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ముందుంటారని, ఒకప్పుడు రక్తదాన శిబిరాలను, ఇప్పుడు ఆక్సిజన్ శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణాలు నిలబెడుతున్నారన్నారు. కరోనా సమయంలో ఆకలితో అర్థ నాదాలు చేస్తున్న ఎంతో మంది కార్మికులకు ఆయన కడుపు నింపారని, చిరంజీవిలో దాగి ఉన్న సేవా గుణాన్ని బయటపెడుతూ, చిరంజీవి ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ పవర్ స్టార్ ఎమోషనల్ అవుతూ చిరంజీవికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…