తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది ఆర్టిస్టులు తన హావభావాలతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో పావలా శ్యామల ఒకరు.ముఖ్యంగా ‘బాబాయ్ హోటల్’ ‘వర్షం’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘గోలిమార్’ వంటి సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఒకప్పుడు ఎంతో మందిని తన హాస్యంతో నవ్వించిన పావలా శ్యామల ఇప్పుడు ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఒక వైపు వయసు పైబడటమే కాకుండా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో తీవ్ర సతమతమవుతున్నారు. ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో వయసుపైబడిన వారు లేకుండా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలపైనే తన జీవనోపాధి ఆధారపడిన శ్యామల ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందిస్తుంది. అయితే అది తన మందులకే సరిపోతుందని ఆమె తన బాధను వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి తెలుసుకున్న మా అసోసియేషన్ సంస్థవారు ఈమెకు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పావలా శ్యామల దయనీయ పరిస్థితిని తెలుసుకున్న కరాటే కళ్యాణి తనవంతు సాయంగా ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేశారు.ప్రస్తుతం పావలా శ్యామలతో పాటు తన కూతురు కూడా అనారోగ్యంతో బాధ పడటంతో ఈమె ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…