క్రైమ్‌ సస్పెన్స్‌గా వచ్చిన నితిన్‌ ‘మ్యాస్ట్రో’.. ప్రేక్షకులను అలరించిందా..? రివ్యూ..!

September 17, 2021 8:39 PM

ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను తెలుగులో రీమేక్‌ చేస్తే కొన్ని ప్రేక్షకులకు నచ్చవు. కానీ కొన్ని మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. అందువల్ల రీమేక్‌ అయినప్పటికీ ప్రేక్షకులకు కొన్ని నచ్చుతాయి. గతంలో పలు తెలుగు మూవీలు ఇలాగే హిట్‌ అయ్యాయి. అయితే హిందీ మూవీ అంధాధున్‌కు రీమేక్‌గా వచ్చిన నితిన్‌ మ్యాస్ట్రో మూవీ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ? అన్న విషయానికి వస్తే..

nithin maestro telugu movie review

కథ..
అరుణ్‌ (నితిన్‌) ఒక పియానో వాయిద్యకారుడు. అతను కొన్ని కారణాల వల్ల అంధుడిగా నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను సిమ్రన్‌ (తమన్నా), సీఐ బాబీ (జిష్షు సేన్‌గుప్తా)లు అనుకోకుండా చేసిన ఓ హత్యను చూస్తాడు. కానీ అంధుడిగా నటిస్తుండడం చేత అతను చూసిన హత్యను ఎవరికీ చెప్పలేడు. ఏమైతే అదైందని పోలీస్‌ స్టేషన్‌కు కూడ వెళ్తాడు. అక్కడ మర్డర్‌ రిపోర్టు ఇవ్వాలని చూస్తాడు. తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అరుణ్‌ ఏ విధంగా ఈ సమస్య నుంచి బయట పడ్డాడు ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

మూవీలో నటులందరూ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. తమన్నా భర్తగా నరేష్‌ కొంత సేపు కనిపించినా ఆయన నటన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగిలిన నటులు కూడా ఫర్వాలేదనిపించారు. అయితే తమన్నా ఈ మూవీలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. కనుక ఆమె డైలాగ్స్‌ను వినేందుకు కొద్దిగా కష్టపడాలి. బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీతం కూడా బాగానే ఉంది.

హిందీ మూవీ అంధాధున్‌ లోని కథను దర్శకుడు మేర్లపాక గాంధీ యథావిధిగా తీసుకున్నాడు. అందువల్ల కథ అలాగే కొనసాగుతుంది. చిన్న చిన్న మార్పులు చేశారు. అయినప్పటికీ సస్పెన్స్‌గా కథనం సాగుతుంది. అయితే హిందీ మూవీ చూసిన వారికి మ్యాస్ట్రో పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ హిందీ మూవీని చూడకుండా ఈ మూవీనే నేరుగా చూసే వారికి కొత్త ఫీలింగ్‌ కలుగుతుంది. ఒక భిన్న కథాంశం కనుక ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. ఒక్కసారి ఈ మూవీని చూడవచ్చు.

రేటింగ్‌ – 3.5/5

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now