టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తన కుటుంబం పట్ల ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో మనందరికీ తెలిసినదే. ఒకవైపు సినిమాలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉండే మహేష్ బాబు వీలు దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి ట్రిప్స్ వెళ్తుంటారు.అదేవిధంగా మహేష్ బాబు భార్య నమ్రత ఎప్పటికప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే నమ్రత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు ఏదైనా సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు తనతోపాటు నమ్రతా వెళ్లి అక్కడ ప్రాంతాలను చూసి రావడం ఆమెకు అలవాటు.ఈ నేపథ్యంలోనే ఓ సినిమా షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్ళిన నమ్రత అక్కడ మహేష్ బాబుని వదిలి తన కొడుకు గౌతమ్ తో కలిసి అందమైన ప్రదేశాలు అన్నింటిని తిరిగి వచ్చారు.
ఈ ట్రిప్పులో తన కొడుకుతో చేసిన రోడ్ ట్రిప్ ఎప్పటికీ మరిచిపోలేనని, ఈ మేరకు తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…