గ‌ర్ల్‌ఫ్రెండ్ కోసం ఐఫోన్ కావాల‌ని సోనూసూద్‌ను అడిగిన యూజర్‌.. సోనూ రియాక్ష‌న్ ఇదీ..!

June 22, 2021 4:06 PM

క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి న‌టుడు సోనూసూద్ ఇప్ప‌టి వ‌ర‌కు బాధితుల‌కు స‌హాయం చేస్తూనే ఉన్నాడు. అనేక హాస్పిట‌ల్స్ వ‌ద్ద త‌న ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశాడు. ఇప్ప‌టికీ రోజూ ఎంతో మంది స‌హాయం కోసం సోనూసూద్‌ను ఆశ్ర‌యిస్తుంటారు. ఇక సోష‌ల్ మీడియాలోనూ చాలా మంది సోనూను హెల్ప్ అడుగుతుంటారు.

man asked sonusood for help sonu replied

అయితే ఒక యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో సోనూసూద్‌ను స‌హాయం కావాల‌ని అడిగాడు. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వ‌మ‌ని అడుగుతుంద‌ని, ఏదైనా స‌హాయం చేయండి.. అంటూ అత‌ను సోనూసూద్‌ను స‌హాయం కోరాడు. అయితే ఆ యూజ‌ర్ ట్వీట్ క స్పందించిన సోనూ ఇలా అన్నాడు.. బ్ర‌ద‌ర్‌, మీ గ‌ర్ల్ ఫ్రెండ్ గురించి నాకు తెలియ‌దు, కానీ ఆమెకు ఐఫోన్‌ను కొనిస్తే నీ ద‌గ్గ‌ర ఏమీ ఉండ‌దు.. అంతా పోతుంది.. అని ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడు.

కాగా సోనూసూద్ ఇచ్చిన ఆ రిప్లై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దానికి నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. భాయ్‌.. కొంద‌రికి ఏం హెల్ప్ అడ‌గాలో తెలియ‌దు.. అని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. కొంద‌రు రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అడిగి ఉండాల్సింది.. అని ఇంకొంద‌రు కామెంట్లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now