సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ జూన్ నెలలో రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాలకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసిన విషయం విదితమే. చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగానే ఉందంటూ వార్తు వచ్చాయి. అయితే పరిస్థితి విషమించండంతో ఆయన కన్ను మూశారు. శ్వాసకోశ సమస్యల వల్లే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు.
కాగా కత్తి మహేష్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన లేని లోటును జీర్ణించుకోలేకపోతున్నారు. కత్తి మహేష్ చనిపోయారని తెలిసిన వెంటనే తాను షాక్‌కు గురయ్యానని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. అలాగే ట్యాక్సీవాలా ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మహేష్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్‌లో తెలిపారు.
హ్యాపీ డేస్ ఫేమ్ ఆదర్శ్ కత్తి మహేష్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో మహేష్‌తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. మహేష్ మరణించాడని తెలుసుకుని తాను షాక్‌కు గురయ్యానని నాచురల్ స్టార్ నాని తెలిపాడు. ఇక మహేష్ అభిమానులు ఆయన మరణవార్తను జీర్ణించుకోలేక ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…