బిగ్ బాస్ ఫేమ్, సినీ విమర్శకుడు, నటుడు.. కత్తి మహేష్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ పరిస్థితి విషమించింది. దీంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ కావడంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి సీరియస్ కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. ఈ క్రమంలో డాక్టర్లు తల, కంటి భాగాల్లో శస్త్రచికిత్స చేశారు.
కాగా కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ 2 వారాలుగా కత్తి మహేష్‌కు నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స అందించినా ఆయన ప్రాణాలు దక్కలేదు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…