టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ సరసన రియా చక్రవర్తి, రుచితా రామ్ కథానాయికలుగా నటించారు.
రొమాంటిక్ కామెడి తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లోనే ప్రేక్షకుల ముందు విడుదల కావాల్సిన ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
రొమాంటిక్ కామెడి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో
రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీత స్వరాలు అందించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది అనే సమాచారం వినిపించినప్పటికీ చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…