రాజమన్నార్ పాత్రలో కేక పుట్టిస్తున్న జగ్గు భాయ్ లుక్..!

August 23, 2021 9:20 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జగపతిబాబు కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన “లెజెండ్” సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే తన రెండవ ఇన్నింగ్స్ హీరోగా కాకుండా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ హీరోగా కన్నా విలన్ గానే ఎన్నో మంచి విజయాలను అందుకుంటున్నారు.

నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వంటి సినిమాల్లో విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జగపతి బాబు తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌ సినిమాలో కూడా విలన్ పాత్రలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో జగపతి బాబు రాజ మన్నార్ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ క్రమంలోనే జగపతి బాబు రాజ మన్నార్ పాత్రకి సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో జగపతిబాబు ముక్కుకు నత్తుతో పాటు నోటిలో సిగార్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment