చలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక తల్లి అయినట్లు.. అందుకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఛార్మి కంగ్రాట్స్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఏంటి? తల్లి కావడమే ఏంటని? ఆలోచిస్తున్నారా.. అయితే అసలు మేటర్ లోకి వెళ్దాం.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా తరహాలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం గత ఏడాది నుంచి ఛార్మి ముంబైలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా చార్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఛార్మికి పెట్స్ ఎంత ఇష్టమో గతంలో కొన్ని ఫోటోలు ద్వారా మనకు తెలియజేసింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు సినిమా షూటింగులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే షూటింగ్ నిమిత్తం రష్మిక ముంబైలో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే నటి ఛార్మిని కలిసినప్పుడు, ఛార్మి రష్మికకు ఒక పెట్ దత్తత ఇస్తూ తల్లివి అయినందుకు కంగ్రాట్స్ తెలుపుతూ ఒక ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా చార్మి చేసిన పోస్టుకు రష్మిక థాంక్యూ ఛార్మి అంటూ స్పందించారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…