టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కెరియర్ మొదట్లో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో నుంచి వరుస అప్‌డేట్‌లను విడుదల చేస్తూ చిత్ర బృందం అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ నటిస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి ఓ వ్యక్తి కారణమని పవన్ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.
ఉన్నత చదువులు చదవడానికి ఏమాత్రం ఇష్టపడని పవన్ కల్యాణ్ ఒంటరిగా కూర్చొని ఏవో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలోనే తన వదిన, మెగాస్టార్ భార్య సురేఖ చిరంజీవితో మాట్లాడి పవన్ కల్యాణ్ ను ఎలాగైనా సినిమాలలోకి తీసుకు వెళ్లాలని సూచించారట. సినిమాలంటే ఇష్టం లేని పవన్ కల్యాణ్ ను సురేఖ బలవంతంగా ప్రోత్సహించడం వల్లే నేడు పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారని ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎన్నో సందర్భాలలో కూడా తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ స్టార్‌డమ్ సంపాదించడం వెనక తన వదిన సురేఖ ప్రోత్సాహం చాలా ఉందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…