మంచువారి అబ్బాయితో రొమాన్స్ చేయనున్న జాతి రత్నాలు బ్యూటీ ?

June 18, 2021 11:59 AM

అదృష్టం ఉంటే కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతారు. ఈ విధంగా సెలబ్రిటీ స్టేటస్ సంపాదించిన వారిలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఒకరని చెప్పవచ్చు. జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా తన అద్భుతమైన కామెడీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లాకి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఢీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఢీ చిత్రానికి సీక్వెల్ ఢీ2తెరకెక్కించాలనే ఆలోచనలో దర్శకుడు ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా జాతి రత్నాలు బ్యూటీని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు శ్రీను వైట్ల ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నో సంవత్సరాల నుంచి ఒక హిట్ లేకుండా ఫ్లాప్ లనే ఎదుర్కొంటున్న హీరో, డైరెక్టర్ ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సాధించాలని పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ చిత్రానికి ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ విధంగా జాతిరత్నాలు బ్యూటీకి శీను వైట్ల దర్శకత్వంలో ఆఫర్ రావడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పవచ్చు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now