నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాదాలు.. అవన్నీ అపోహలంటున్న సింగర్ చిన్మయి!

April 27, 2021 12:05 PM

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు వైరస్ వ్యాప్తిని కట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వాక్సిన్ పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి.సోషల్ మీడియాలో వచ్చే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ చిన్మయి స్పందించారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాదాలు తలెత్తుతాయనే తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. వాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని ప్రముఖ గైనకాలజిస్ట్ తో తను ప్రస్తావించానని దానిలో ఏ మాత్రం నిజం లేదని గైనకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత మంజుల అనగాని తెలిపారు అంటూ చిన్మయి పేర్కొన్నారు.

చిన్మయి చేసిన ఈ పోస్టుపై ఎంతోమంది మహిళలు స్పందించి, మేము కూడా నెలసరి సమయంలోనే వ్యాక్సిన్ వేసుకున్నాము. అయితే వ్యాక్సిన్ వల్ల తమకు ఎటువంటి సమస్య ఏర్పడలేదని వారు తెలియజేశారు. ఈ విధమైనటువంటి ముఖ్యమైన సమాచారం అందించినందుకు గాను చిన్మయికి మరికొందరు మహిళలు అభినందనలు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment