ముహూర్తం ఫిక్స్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5.. ఎప్పుడంటే ?

June 9, 2021 9:59 PM

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో “బిగ్ బాస్”ఒక్కటి. ఈ షో అన్నివర్గాల ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ రియాలిటీ షో ను తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో కూడా ప్రసారం చేయడం జరుగుతోంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలామంది మంచి క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నారు ప్రస్తుతం .తెలుగు బిగ్ బాస్ షో నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఐదో సీజన్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన గత రెండు సీజన్లకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ఐదవ సీజన్ కూడా ఆయనకే హోస్టింగ్ బాధ్యతలను అప్పగించారట. అలాగే బిగ్ బాస్ ఐదో సీజన్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీలే కాకుండా,సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన కొందరి ప్రముఖులను ఈ షో కు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది వీరిలో యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్,యాంకర్ శివ, హైపర్ ఆది, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, శేఖర్ మాస్టర్, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బిగ్ బాస్ ఐదో సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లను జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి పదిరోజులు లోపే కంటెస్టెంట్లను ఖరారు చేసి క్వారెంటైన్లో ఉంచి అటునుండి నేరుగా బిగ్ బాస్ హౌస్ కి తీసుకెళ్లి ఆలోచనలో ఉన్నారట షో నిర్వాహకులు. నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్‌ నెలలో నిర్వహించాలని షో నిర్వాహకులు భావించిన కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. దీంతో ఈ షోను జూలై మూడో వారంలో కానీ ఆగస్టు నెలలో కానీ కచ్చితంగా ప్రారంభించాలని షెడ్యూల్ తయారు చేస్తున్నారట షో నిర్వాహకులు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now