జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..

June 11, 2021 6:02 PM

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని ఇది వరకు ఎంతోమంది అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఇదే విషయమే నందమూరి బాలకృష్ణ వరకు చేరడంతో ఆయన ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై తనదైన శైలిలో స్పందించారు. జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణకు ఈ ప్రశ్న ఎదురుకావడంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని.. ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే పార్టీ కి ప్లస్ కాకుండా మైనస్ అయితే ఏం చేస్తారంటూ బాలయ్య ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ మాట్లాడుతూ… రాజకీయాల విషయానికి వస్తే తన అల్లులు లోకేష్, భరత్ లు ఎంతో చదువులు చదువుకున్నారని,పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి కావల్సిన క్వాలిటీస్ వారికి ఉన్నాయని దేనికైనా వారిద్దరూ ఎంతో సమర్థులని తెలిపారు.

ప్రస్తుతం పార్టీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది కార్యకర్తలు పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి ఇవ్వాలనే చెబుతున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి, “ఎన్టీ రామారావు సినిమాలలో నటించి ముఖ్యమంత్రి అయ్యాడని.. ఎన్టీఆర్ కూడా సినిమాలలో నటిస్తూ అన్ని కావాలనుకుంటే అవ్వవు.. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఆవేశంలో నుంచి పుట్టుకొచ్చింది. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతో నిబద్ధతతో ఉన్నారు. అలాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా బాలయ్య బాబు మీడియాతో ముచ్చటించారు. మొత్తానికి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ పార్టీని నడపడం తమ అల్లుళ్ళకే సాధ్యమని, ఎన్టీఆర్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని విషయాన్ని ఈ సందర్భంగా బాలయ్య బయటపెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now