రాధ‌ కూతురు ఇప్పుడు ఏం చేస్తుంది ?

June 10, 2021 10:55 PM

వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జోష్. ఈ సినిమా 2009లో విడుదల కాక యాక్షన్ మూవీ గా తెరకెక్కింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటించగా కార్తీక తొలిసారిగా హీరోయిన్ గా పరిచయం అయింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ‌ కూతురు కార్తీక. ఇక జోష్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో కార్తీక పాత్రకు తొలి ఉత్తమ నటి అవార్డు కూడా అందింది. మెత్తానికి తొలి సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న కార్తీక ప్రస్తుతం ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో తెలుసా ?

జోష్ సినిమా తర్వాత ఈ అమ్మడు తమిళ, మలయాళ సినిమాల వైపు అడుగులు వేసింది. వరుస సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేదు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా తో ఎంట్రీ ఇవ్వగా అందులో తన పాత్ర కొంతవరకు మెప్పించింది. మళ్లీ కోలీవుడ్ లో వరుస సినిమాలో నటించింది. ఇక 2014 లో బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమా లో రౌడీ పిల్లగా బాగా ఆకట్టుకుంది.

ఇక ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలలో అవకాశాలు అందుకోకపోగా 2017 లో బాలీవుడ్ బుల్లితెర సీరియల్ లో నటించింది. ఇక ఆ తర్వాత బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పి పక్కకు తప్పుకుంది. నిజానికి తన ఎంపిక విషయంలో సరిగా లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. గ్లామర్ విషయంలో మంచి క్రేజ్ అందుకున్న కార్తీకా హీరోయిన్ గా మాత్రం అంత క్రేజ్ అందుకోలేదని అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం యూ డీ ఎస్ హోటల్ గ్రూపుకు డైరెక్టర్ గా బాధ్యతలు వ్యవహరిస్తుందని తెలిసింది. మొత్తానికి బిజినెస్ వైపు అడుగులు పెట్టిన ఈ అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెడుతుందో లేదో ఎదురు చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now