బిజినెస్ ఐడియాలు

Mineral Water Plant Business : మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ బిజినెస్‌.. త‌క్కువ పెట్టుబ‌డి, ఎక్కువ లాభం..!

Mineral Water Plant Business : ఒక‌ప్పుడంటే చాలా మంది బావుల్లో, చెరువుల్లో, న‌దుల్లో నీటిని తాగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. అందుక‌ని చాలా మంది ప్ర‌స్తుతం మిన‌ర‌ల్ వాట‌ర్‌ను తాగేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు నివాసం ఉండే ప్రాంతాల‌కు అతి స‌మీపంలో కొంద‌రు మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ల‌ను పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంచెం పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మిస్తే.. ఎవ‌రైనా స‌రే.. ఈ వ్యాపారం చేయ‌వ‌చ్చు. మ‌రి ఈ వ్యాపారానికి పెట్టుబ‌డి ఎంత‌వుతుందో.. ఈ బిజినెస్ ద్వారా ఎంత డ‌బ్బును సంపాదించ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా.

మిన‌రల్ వాట‌ర్ ప్లాంట్ పెట్ట‌డానికి ముందుగా అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలి. జ‌నావాసాల‌కు ద‌గ్గ‌రగా ఉండేలా ప్లాంట్ పెడితే ర‌వాణా ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే వాట‌ర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి ల‌భ్య‌త‌ను, నీటి నాణ్య‌త‌ను ముందుగా చెక్ చేసుకోవాలి. ఇక ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిప‌ల్ ఆఫీస్‌లో లైసెన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అలాగే FSSAI (Food Safety and Standards Authority of India), iso ల నుంచి ప‌ర్మిట్, స‌ర్టిఫికెట్ల‌ను పొందాలి. దీంతో త‌రువాతి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం స‌జావుగా సాగుతుంది. ఇలా అన్నీ తెలుసుకుని వ్యాపారం ప్రారంభిస్తే.. సుదీర్ఘ కాలం ఎలాంటి స‌మ‌స్య లేకుండా వ్యాపారం కొన‌సాగించి.. లాభాల బాట ప‌ట్ట‌వ‌చ్చు.

Mineral Water Plant Business

మిన‌ర‌ల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు.. ముందుగా బోర్ వేయాలి. మీరు ఎంత నీటిని ప్యూరిఫై చేస్తారు..? ఎంత నీటిని నిత్యం స‌ప్ల‌యి చేయ‌గ‌ల‌రు..? ఎంత నీటిని విక్ర‌యించ‌గ‌ల‌రు..? అని బేరీజు వేసుకుని ఆ మేర సామ‌ర్థ్యం ఉన్న బోర్లు వేసుకోవాలి. ఆ త‌రువాత వాట‌ర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేయాలి. ఇక బోర్ నీటిని, ప్యూరిఫై అయిన నీటిని స్టోర్ చేసేందుకు విడి విడిగా సంపులు లేదా వాట‌ర్ ట్యాంకుల‌ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వాట‌ర్ ట్యాప్‌లు, వాట‌ర్ క్యాన్స్‌, వాట‌ర్ ఫిల్లింగ్ మెషిన్‌లు కూడా అవ‌స‌రం అవుతాయి.

మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్‌ను స‌హ‌జంగా చాలా మంది షెడ్ల‌లో ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇండ్ల వ‌ద్దే కావ‌ల్సినంత స్థ‌లం ఉన్న‌వారు త‌మ ఇండ్ల‌లోనే ఈ ప్లాంట్ల‌ను పెట్టుకోవ‌చ్చు. దీంతో స్థ‌లానికి అయ్యే ఖ‌ర్చు క‌ల‌సి వ‌స్తుంది. ఇక వాట‌ర్ ప్లాంట్‌కు అవ‌స‌రం అయ్యే విద్యుత్‌ను అందించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఆటంకం ఉండ‌కుండా చూసుకోవాలి. అవ‌స‌రం ఉన్న మేర ప్ర‌త్యేక లైన్‌ను కేవ‌లం ప్లాంట్ కోస‌మే ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో ఇప్పుడు చూద్దాం.

వాట‌ర్ ప్యూరిఫైర్ ఖ‌రీదు రూ.1.50 ల‌క్ష‌ల నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. అయితే చిన్న మెషిన్లు మాత్ర‌మే ఈ ఖ‌రీదులో ల‌భిస్తాయి. అదే పెద్ద‌గా బిజినెస్ చేయాల‌నుకుంటే.. పెద్ద మెషిన్ల‌ను కొనుగోలు చేయాలి. అందుకు రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. స్థోమ‌త ఉన్న‌వారు పెద్ద మెషిన్ల‌తో ఒకేసారి పెద్ద ఎత్తున బిజినెస్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. ఇక ప్యూరిఫైర్ కాకుండా ఇత‌ర సామ‌గ్రికి రూ.30వేల నుంచి రూ.50వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. అయితే ప్లాంట్‌కు సంబంధించి ప్యూరిఫైర్ త‌దిత‌ర మెషిన్ల‌ను ఆర్డ‌ర్ ఇస్తే కంపెనీ వారే వ‌చ్చి బిగిస్తారు. ఆ త‌రువాత ప్లాంట్‌పై ఎలా ప‌నిచేయాలో వారు వివ‌రిస్తారు. ఇక త‌రువాతి రోజుల్లో ప్లాంట్‌లో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. స‌ద‌రు కంపెనీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేస్తే.. వారు టెక్నిషియ‌న్ల‌ను పంపి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారు.

బోర్ నుంచి నీటిని తీసుకునే ప్యూరిఫైర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్‌ట్యాంకుల్లోకి పంపుతుంది. దీంతో నీరు ఆ ట్యాంకుల్లో స్టోర్ అవుతుంది. అక్క‌డి నుంచి వాట‌ర్ ఫిల్లింగ్ మెషిన్ ద్వారా ఆ ట్యాంకుల్లోని నీటిని 20 లీట‌ర్ల క్యాన్ల‌లోకి నింపి స‌ర‌ఫ‌రా చేస్తారు. ఇక ప్యూరిఫైర్ తో ఒక్క‌సారి 450 నుంచి 500 లీట‌ర్ల వ‌ర‌కు నీటిని ప్యూరిఫై చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే నీటిని కూలెంట్ ద్వారా కూల్ చేసి కూల్ వాట‌ర్‌ను కూడా స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో 15 లీటర్ల కూల్ వాట‌ర్‌ను రూ.25 నుంచి రూ.30 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. అదే న‌గ‌రాల్లో అయితే రూ.40 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు.

మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ వ్యాపారం స‌హ‌జంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది. కాక‌పోతే వేస‌విలో ఈ బిజినెస్ ఇంకా బాగా జ‌రుగుతుంది. నీటిని ఎక్కువ‌గా స‌ప్ల‌యి చేయ‌గ‌లిగితే ఎక్కువ లాభాల‌ను వేస‌విలో ఆర్జించ‌వ‌చ్చు. ఇక ఒక మోస్త‌రు ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో 20 లీట‌ర్ల వాట‌ర్ క్యాన్‌ను రూ.5 నుంచి రూ.10 వ‌ర‌కు, అదే సిటీల్లో అయితే రూ.35 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. అదే కూల్ వాట‌ర్ అయితే రూ.25 నుంచి రూ.40 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఇక నీటిని హోం డెలివ‌రీ చేస్తే అద‌నంగా మ‌రో రూ.5 నుంచి రూ.10 వ‌ర‌కు ఎక్స్‌ట్రా వ‌సూలు చేయ‌వ‌చ్చు. ఇక నార్మ‌ల్ వాట‌ర్ క్యాన్‌పై రూ.4 వ‌ర‌కు ఖ‌ర్చు అయితే రూ.6 నుంచి లాభం పొంద‌వ‌చ్చు. అదే కూల్ వాట‌ర్ క్యాన్ అయితే రూ.10 నుంచి లాభం పొంద‌వ‌చ్చు.

ఇక రోజుకు 200 నార్మ‌ల్ వాట‌ర్ క్యాన్ల‌ను అమ్మితే లాభం క‌నీసం రూ.6 అనుకుంటే.. రోజుకు 200 * రూ.6 = రూ.1200 వ‌ర‌కు.. నెల‌కు 30 * 1200 = రూ.36,000 లాభం వ‌స్తుంది. అదే రోజూ క‌నీసం 50 కూల్ వాట‌ర్ క్యాన్ల‌ను అమ్మినా.. లాభం క‌నీసం రూ.10 అనుకుంటే.. 50 * 10 = రూ.500 నెల‌కు 30 * 500 = రూ.15,000 లాభం వ‌స్తుంది. ఈ క్ర‌మంలో నెల‌కు రెండు మొత్తాలు క‌లిపి రూ.36,000 + రూ.15,000 = రూ.51,000 వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు. అయితే పెద్ద మెషిన్ల‌తో బిజినెస్ ప్రారంభిస్తే.. ఇంకా ఎక్కువ మొత్తంలో వాట‌ర్ క్యాన్ల‌ను అమ్మి.. ఆ మేర లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు.

ఇక మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ బిజినెస్ పెట్టేవారు వ్యాపారాన్ని ప‌బ్లిసిటీ కూడా చేసుకోవాలి. అందుకు గాను వారు వార్తా ప‌త్రిక‌లు, స్థానిక కేబుల్ టీవీ చాన‌ల్స్‌, సినిమా థియేట‌ర్లు.. త‌దిత‌ర మాధ్య‌మాల్లో బిజినెస్ ప్ర‌చారం చేసుకోవాలి. దీంతో వ్యాపారం ఎక్కువ‌గా వృద్ధి చెందుతుంది. అలాగే హోట‌ళ్లు, రెస్టారెంట్లు.. ఇత‌ర వ్యాపారుల‌తో ఒప్పందం చేసుకుంటే.. బిజినెస్ డెవ‌ల‌ప్ అవుతుంది. ఈ క్ర‌మంలో ట్రాలీ ఆటోల‌ను, మ‌నుషుల‌ను పెట్టుకుంటే.. మిన‌ర‌ల్ వాట‌ర్‌ను ర‌వాణా చేయ‌డం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. ఇలా ఈ వ్యాపారాన్ని ఎవ‌రైనా లాభ‌సాటిగా మార్చుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM