Diabetes And Pomegranate : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మందికి వస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన చాలా మంది పడుతున్నారు. దీంతో జీవితాంతం మందులు మింగాల్సి వస్తోంది. అయితే కొందరిలో మాత్రం మందులు మింగినా షుగర్ కంట్రోల్‌లో ఉండడం లేదు. అలాంటి వారు తమ ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్‌ను కంట్రోల్ చేయగలిగే పండ్లను తింటే మంచిది. వాటిల్లో దానిమ్మ పండు కూడా ఒకటి. మరి డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందామా.
డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే వాటిలో ఉండే 4 రకాల యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. సదరు యాంటీ ఆక్సిడెంట్లు ellagitannin అనే వర్గానికి చెందుతాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్న పలువురు పేషెంట్లు దానిమ్మ పండ్లను తిన్నాక 3 గంటల తరువాత వారి షుగర్ లెవల్స్‌ను పరీక్షించగా.. అవి చాలా వరకు తగ్గాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని తగ్గించడంలో దానిమ్మ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు చెబుతున్న ప్రకారం.. దానిమ్మ పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే పాలీఫినాల్స్, ఆంథోసయనిన్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి. దీంతో టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
డయాబెటిస్ ఉండేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల వారికి వైద్యులు కొలెస్ట్రాల్ మెడిసిన్‌ను కూడా ఇస్తుంటారు. అయితే కొలెస్ట్రాల్ మరింత కంట్రోల్‌లో ఉండాలంటే.. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తరచూ దానిమ్మ పండ్లను తినాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడుతుంటాయి. ఇవి శరీర కణజాలాన్ని నాశనం చేసి క్యాన్సర్‌కు కారణమవుతాయి. కనుక దానిమ్మ పండ్లను తింటే.. వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సదరు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను తరచూ తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…