బిజినెస్ ఐడియాలు

అదిరిపోయే బిజినెస్ ఐడియా.. ఐఆర్‌సీటీసీ ద్వారా నెల‌కు రూ.80వేలు సంపాదించుకునే అవ‌కాశం..!

స్వయం ఉపాధి ద్వారా నెల నెలా అధిక మొత్తంలో ఆదాయాన్ని సంపాదించుకోవాల‌ని ఎదురు చూస్తున్న వారికి ఐఆర్‌సీట‌సీ అదిరిపోయే బిజినెస్ అవ‌కాశాన్ని అందిస్తోంది. దీని ద్వారా నెల‌కు రూ.80వేల వ‌ర‌కు సంపాదించుకోవ‌చ్చు. అందుకు మీరు చేయాల్సింద‌ల్లా ఐఆర్‌సీటీసీ బుకింగ్ ఏజెంట్‌గా మార‌డ‌మే.

మ‌న దేశంలో రైళ్ల‌లో నిత్యం ప్ర‌యాణించే వారి సంఖ్య కోట్ల‌లో ఉంటుంది. వారిలో 55 శాతం మంది ఆన్‌లైన్‌లోనే టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటుంటారు. అందువ‌ల్ల ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారితే నెల నెలా చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు త‌త్కాల్‌, వెయిటింగ్ లిస్ట్‌, ఆర్ఏసీ.. ఇలా ఏ త‌ర‌హా టిక్కెట్ల‌ను అయినా బుక్ చేయ‌వ‌చ్చు.

ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లకు ఒక నాన్ ఏసీ టిక్కెట్‌ను బుక్ చేస్తే రూ.20, ఏసీ క్లాస్ టిక్కెట్ కు రూ.40 క‌మిష‌న్ ఇస్తారు. అలాగే రూ.2వేలు ఆపైన ట్రాన్సాక్ష‌న్ చేస్తే 1 శాతం, రూ.2వేల లోపు ట్రాన్సాక్ష‌న్ చేస్తే 0.75 శాతం పేమెంట్ గేట్‌వే చార్జిల‌ను చెల్లిస్తారు.

ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు ఎన్ని టిక్కెట్ల‌ను అయినా బుక్ చేయ‌వ‌చ్చు. అందుకు లిమిట్ ఏమీ లేదు. టిక్కెట్ల‌ను బాగా బుక్ చేస్తే నెల‌కు రూ.80వేలు సంపాదించుకోవ‌చ్చు. లేదా క‌నీసం రూ.40వేల నుంచి రూ.50వేల వ‌ర‌కు అయినా స‌రే ఆదాయం వ‌స్తుంది.

ఐఆర్‌సీటీసీ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు అన్‌లిమిటెడ్ టిక్కెట్ల‌ను బుక్ చేయ‌వ‌చ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో టిక్కెట్ల‌ను బుక్ చేసే స‌దుపాయం కూడా క‌ల్పిస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌లకు త‌త్కాల్ ఓపెన్ అయిన 15 నిమిషాల త‌రువాత ఏజెంట్లు టిక్కెట్ల‌ను బుక్ చేయ‌వ‌చ్చు. సుల‌భంగా క్యాన్సిల్ కూడా చేయ‌వచ్చు. రైలు, బస్సు, విమాన టిక్కెట్ల‌తోపాటు టూర్ ప్యాకేజీలను కూడా బుక్ చేయ‌వ‌చ్చు. విదేశీ కరెన్సీని మార్పిడి చేయ‌వ‌చ్చు. ప్రీపెయిడ్ రీచార్జిలు చేయ‌వ‌చ్చు. ఇలాంటి స‌దుపాయాలు ల‌భిస్తాయి.

విమాన టిక్కెట్ల‌ను బుక్ చేసేందుకు ఏజెంట్ల‌కు ప్ర‌త్యేక అకౌంట్‌ను అందిస్తారు. ఏడాది పాటు ఆథ‌రైజ్డ్ బుకింగ్ స‌ర్వీస్ తీసుకుంటే రూ.3,999, 2 ఏళ్ల‌కు రూ.6,999 ఫీజు చెల్లించాలి. 100 టిక్కెట్ల‌ను బుక్ చేస్తే రూ.10, 101 నుంచి 300 టిక్కెట్ల‌ను బుక్ చేస్తే రూ.8, 300కు పైగా టిక్కెట్ల‌ను బుక్ చేస్తే ఒక్కో టిక్కెట్‌కు రూ.5 వ‌ర‌కు చార్జిలను వ‌సూలు చేస్తారు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అందులో ఆన్‌లైన్ ఫామ్‌ను నింపాలి. పాన్‌, ఆధార్ వంటి స్కాన్ చేసిన డాక్యుమెంట్ల‌ను, సైన్ చేసిన అప్లికేష‌న్‌ను, డిక్ల‌రేష‌న్ ఫామ్‌ను పంపించాలి. వెరిఫై అయ్యాక ఐఆర్‌సీటీసీ ఐడీని క్రియేట్ చేసేందుకు రూ.1180 డిపాజిట్ చేయాలి. త‌రువాత డిజిట‌ల్ స‌ర్టిఫికెట్‌ను ఇష్యూ చేస్తారు. ఓటీపీ, వీడియో వెరిఫికేష‌న్ చేస్తారు.

ఆ త‌రువాత డిజిట‌ల్ స‌ర్టిఫికెట్ వ‌స్తుంది. అనంత‌రం ఐఆర్‌సీటీసీ ఫీజును డిపాజిట్ చేయాలి. ఫీజు అందాక ఐఆర్‌సీటీసీ లాగిన్ వివ‌రాల‌ను మెయిల్ చేస్తారు. దీంతో అధికారికంగా ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారిన‌ట్లు అవుతుంది.

ఇక ఈ ప్ర‌క్రియ‌కు పాన్‌, ఆధార్ కార్డు, మొబైల్ నంబ‌ర్, ఈ-మెయిల్ ఐడీ, ఫొటో, ఆఫీస్ అడ్ర‌స్ ప్రూఫ్‌, ఇంటి అడ్ర‌స్ ప్రూఫ్‌, డిక్ల‌రేష‌న్ ఫామ్‌, రిజిస్ట్రేష‌న్ ఫామ్ వంటి డాక్యుమెంట్లు కావాలి. వీటితో ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM