NTR : మంచి కంటెంట్ ఉన్న సినిమా సాంబ‌.. అయినా హిట్ కాలేక‌పోయింది.. కార‌ణాలు ఇవే..!

October 3, 2021 4:10 PM

NTR : ఎన్‌టీఆర్ పేరు చెబితేనే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌స్తాయి. ఇక ఆయ‌న బొమ్మ సినిమాలో ప‌డిందంటే చాలు.. మినిమం 100 రోజులు గ్యారంటీ. అలా ఎన్‌టీఆర్ సృష్టిస్తున్న ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. అయితే ఎంత సెల‌బ్రిటీ అయినా కొన్ని సార్లు ఫ్లాపులు త‌ప్ప‌వు. సినిమా మొత్తం అన్నీ బాగానే ఉన్న‌ప్ప‌టికీ ప‌లు భిన్న కార‌ణాల వ‌ల్ల కొన్ని సార్లు అగ్ర హీరోల సినిమాలు కూడా ఫ్లాప్‌లుగా మారుతుంటాయి. కొన్ని యావ‌రేజ్‌గా ఆడుతుంటాయి.

NTR : మంచి కంటెంట్ ఉన్న సినిమా సాంబ‌.. అయినా హిట్ కాలేక‌పోయింది.. కార‌ణాలు ఇవే..!

ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న కెరీర్‌లో అట్ట‌ర్ ఫ్లాప్స్ లేకున్నా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. కొన్ని యావ‌రేజ్‌గా న‌డిచాయి. కొన్ని అబోవ్ యావ‌రేజ్ గా న‌డిచాయి. ఇక కొన్ని మూవీలు బంప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. ఎన్టీఆర్‌, వినాయ‌క్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సాంబ హిట్ కాలేదు కానీ అబోవ్ యావ‌రేజ్ టాక్‌ను సంపాదించుకుంది.

కంటెంట్ మంచిగానే ఉంది. ఎన్‌టీఆర్ ఫామ్‌లో ఉన్నారు. వినాయ‌క్ కూడా ఠాగూర్ తీసి అప్ప‌ట్లో జోష్‌లో ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించిన వారే. కానీ సాంబ మూవీ హిట్ కాలేక‌పోయింది. అబోవ్ యావ‌రేజ్ టాక్‌ను సంపాదించింది. అందుకు రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఎన్‌టీఆర్‌కు చెందిన గ‌త సినిమాల క‌న్నా సాంబ మూవీలో హింస మ‌రీ ఎక్కువైంద‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. ఇక వ‌దిన‌ల‌పైనే అత్యాచారం చేయ‌బోయిన మ‌రుదుల‌ను అందుకు స‌పోర్ట్ చేసిన అన్న‌ల‌ను అందులో చూపించారు. ఇవి ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదు. దీంతో మూవీ అబోవ్ యావ‌రేజ్ గా నిలిచింది.

అయితే సీన్ల‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకునేది. ఈ మూవీలో ఉన్న వ‌దిన, మ‌రుదుల సీన్‌పై వినాయ‌క్ ఇప్ప‌టికీ చెబుతూనే ఉంటారు. ఆ సీన్ల‌ను తీయ‌క‌పోయినా బాగుండేది.. అని అంటుంటారు. అందువ‌ల్ల సాంబ మూవీ హిట్ కాలేక‌పోవ‌డానికి ఆ రెండు అంశాల‌ను బ‌ల‌మైన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. లేదంటే ఎన్‌టీఆర్ ఖాతాలో మ‌రో బంప‌ర్ హిట్ ప‌డి ఉండేది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now