Poonam Kaur : ఆయన గెలిస్తే అన్ని విషయాలూ బయట పెడతా.. పూనమ్ కౌర్..

October 2, 2021 3:46 PM

Poonam Kaur : అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అభ్యర్థులు నువ్వానేనా అన్నట్టు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తీవ్రస్థాయిలో పోటీకి దిగారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Poonam Kaur : ఆయన గెలిస్తే అన్ని విషయాలూ బయట పెడతా.. పూనమ్ కౌర్..

ఇలాంటి సమయంలోనే జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న బండ్ల గణేష్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇలా ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఎన్నికలలోకి సంచలన బ్యూటీ పూనమ్ కౌర్ ఎంటర్ అయి తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ.. తాను ఈ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేసింది.

ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. అందరి మాదిరి ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరు. ఆయన గెలిస్తే సమస్యలన్నింటినీ బయట పెడతాను. ఆయన గెలవాలి, నా పూర్తి మద్దతు ప్రకాష్ రాజ్ కి ఉంటుందని ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now