Pushpa Movie : బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్.. పుష్పరాజ్ వచ్చేది అప్పుడే..

October 2, 2021 2:56 PM

Pushpa Movie : సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక కలిసి పుష్ప అనే పాన్ ఇండియా స్థాయి చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి కావస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ఇదివరకే అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా విడుదల పై బాలీవుడ్ ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు.

Pushpa Movie : బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్.. పుష్పరాజ్ వచ్చేది అప్పుడే..?

ఈనెల 22వ తేదీ నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోవడం వల్ల బాలీవుడ్ సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే క్రిస్మస్ కానుకగా బాలీవుడ్ “86” సినిమా రావడం చేత పుష్ప సినిమా మరొకసారి వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ముందుగా అనుకున్న దాని కన్నా ఒక వారం ముందుగానే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది.

ఈ క్రమంలోనే పుష్ప సినిమాను డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. అనుకున్న దాని కన్నా ఒక వారం ముందుగా రావడంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా పుష్పరాజ్ పాత్రలో, రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now