kiara advani : గంప గుత్త‌గా మొత్తం ఒకే డీల్‌.. రూ.12 కోట్ల‌కు కియారా అద్వానీకి బంప‌ర్ ఆఫ‌ర్ ?

October 2, 2021 9:59 AM

kiara advani : స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు బాలీవుడ్‌లో మంచి ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. అయితే ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈమెకు రూ.12 కోట్ల మేర భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న త్వ‌ర‌లో నిర్మించ‌బోయే మూడు సినిమాల‌కు గాను గంప గుత్తగా మొత్తం రూ.12 కోట్ల‌తో కియారా అద్వానీకి భారీ ఆఫ‌ర్‌ను ఇచ్చార‌ని టాక్ వినిసిస్తోంది.

kiara advani : గంప గుత్త‌గా మొత్తం ఒకే డీల్‌.. రూ.12 కోట్ల‌కు కియారా అద్వానీకి బంప‌ర్ ఆఫ‌ర్ ?

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో కియారా అద్వానీ ఇప్ప‌టికే న‌టిస్తోంది. అయితే త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌, టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిపైల్లిల కాంబినేష‌న్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ మూవీని త్వ‌ర‌లో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి గాను కియారాను తీసుకోవాల‌ని దిల్ రాజు అనుకున్నార‌ట‌.

అయితే దిల్ రాజు నిర్మాణంలో ఇంకో రెండు మూవీల‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో విజ‌య్ సినిమాతోపాటు మ‌రో రెండు మూవీల‌కు.. మొత్తం 3 మూవీల‌కు గంప గుత్త‌గా రూ.12 కోట్ల‌కు కియారాకు దిల్ రాజు భారీ ఆఫ‌ర్‌ను ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుకు కియారా కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈమె త్వ‌ర‌లో వ‌రుస‌గా మూడు సినిమాల్లో క‌నిపించే చాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇక ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now