Suma : రాజీవ్ కనకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమ.. నా భర్త అలాంటివాడే అంటూ..!

October 1, 2021 7:00 PM

Suma : బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే రాజీవ్ కనకాల కూడా ప్రముఖ నటుడిగా అందరికీ సుపరిచితమే. రాజీవ్ కనకాల ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయనకు సరైన పాత్రలు రావడం లేదని చెప్పవచ్చు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ కనకాల ఎంతో అద్భుతమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

Suma : రాజీవ్ కనకాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమ.. నా భర్త అలాంటివాడే అంటూ..!

ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా చూసిన సుమ.. రాజీవ్ కనకాల పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నటనలో మనల్ని వారి పాత్రలోకి లీనం చేసుకునే నటులు కొంత మంది ఉంటారు. అలాంటి వారిలో నా భర్త రాజీవ్ కనకాల ఒకరు.. అని తెలియజేశారు. అయితే ఈ పాత్రలో నటించడం కోసం ఎంతో కష్టపడి ఉంటాడని ఈ సందర్భంగా సుమ తెలియజేసింది.

https://www.instagram.com/p/CUcuQ2ZpRdS/?utm_source=ig_web_copy_link

ఎంతో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్యలకు సుమ శుభాకాంక్షలు తెలిపింది. ఇక సాయి పల్లవి డాన్స్ ఎంతో అద్భుతంగా చేసిందని, తన డాన్స్ చూస్తుంటే నా కళ్ళు నొప్పి పుట్టాయని ఈ సందర్భంగా సుమ.. లవ్ స్టోరీ సినిమా గురించి.. తన భర్త రాజీవ్ కనకాల పాత్ర గురించి.. కీలక వ్యాఖ్యలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment