Anushkha Shetty : అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన ఆ హీరో.. ఎందుకంటే ?

September 30, 2021 12:20 PM

Anushkha Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుష్క సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలాంటి వెండితెర జేజమ్మకు ఒక టాలీవుడ్ హీరో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత అరుంధతి, బిల్లా, బాహుబలి వంటి చిత్రాలలో నటించింది.

Anushkha Shetty : అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన ఆ హీరో.. ఎందుకంటే ?
Anushkha Shetty

అదే విధంగా టాలీవుడ్ సీనియర్ హీరో అయిన గోపీచంద్ సరసన అనుష్క పలు సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే గోపీచంద్ ఒక విషయంలో అనుష్కకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళంలో నయనతార నటించినటువంటి బిర్లా సినిమాను తెలుగులో ప్రభాస్ హీరోగా బిల్లాగా నటించారు. అందులో నయనతార ఓవర్ ఎక్స్‌పోజింగ్‌ కారణంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే అనుష్క ఈ సినిమాలో చేస్తున్నానన్న విషయాన్ని గోపీచంద్ కు తెలియడంతో గోపీచంద్ అనుష్క కు ఫోన్ చేసి ఆ సినిమాలో నటించవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు ఓ సందర్భంలో అనుష్క తెలియజేసింది. ఈ క్రమంలోనే అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని సమాచారం. అయితే అనుష్క.. ప్రభాస్ బిల్లా సినిమా తర్వాత మరెన్నో అద్భుతమైన అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇటీవలి కాలంలో అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటించగా.. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈమె ఓ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై జేజమ్మ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now